![]() |
![]() |
.webp)
బుల్లితెర నటుడు కాళిదాసు మహేష్ బాబు సాండ్రాతో తన పెళ్లి ముహుర్తాన్ని రివీల్ చేసాడు. సమ ప్రయాణం అనే యూట్యూబ్ ఛానెల్ లో వాళ్ళు ఈ గుడ్ న్యూస్ ని చెప్పారు. "నిజానికి మా పెళ్లి ఈపాటికి ఐపోయి ఉండాలి. శ్రావణ మాసంలో చేసుకోవాల్సి ఉంది. ఐతే ఆగష్టు లో డేట్ సెట్ అయ్యింది. కానీ అప్పుడు షూటింగ్స్ ఉన్నాయి. అలాగే పెళ్లి అంటే చాలా చేయాలి. మినిమం ఒక పది రోజులు పడుతుంది. ఐతే సాండ్రాకి కార్తీక మాసంలో పెళ్లి చేసుకోవాలని మనసులో అనుకుంది. శ్రావణ మాసంలో మా ఇద్దరికీ సంబంధించిన ఏదో ఒక విషయం జరగాలని సాండ్రా కోరుకుంది. అందుకే శ్రావణ మాసంలో శ్రీశైలంలో ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకున్నాం చేసుకున్నాం. అలా ఒక శుభకార్యం జరిగింది. కాబట్టి కార్తీక మాసంలో పెళ్లి చేసుకోవాలి అనుకుని ముహూర్తాలు చూడమని చెప్తే ఒకే ఒక్క డేట్ వచ్చింది.
మా నక్షత్రాలు, జాతకాల ప్రకారం రెండు మూడు ముహూర్తాలు పెట్టమని అడిగాం. సీరియల్ షూటింగ్స్ అవీ జరుగుతూ ఉంటాయి కదా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి అని అడిగాం. ఐతే ఒకే ఒక్క ముహూర్తం తప్ప ఇంకేమీ లేవు కావాలంటే పెట్టుడు ముహుర్తాలు ఉంటాయి అని చెప్పారు. "చి ల సౌ. సాండ్రా సుహాసిని జయచంద్రన్ ని చిరంజీవి కాళిదాసు మహేష్ బాబు గారికి కార్తీక మాసంలో ఒక శుభ నక్షత్రంలో శుభ ముహూర్తం ఐన అక్టోబర్ 31 న ఆ పార్వతి పరమేశ్వరులు నిర్ణయించారు". ఈ డేట్ ఎందుకు స్పెషల్ అంటే ఆ రోజు నా పుట్టినరోజు...దాంతో నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే నేను పుట్టింది తనను పెళ్లి చేసుకోవడానికే అని ఆ దేవుడు రాసిపెట్టేసాడు. ఒక పుణ్య క్షేత్రంలో మా పెళ్లి జరగబోతోంది"...అంటూ కాళిదాసు మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |